Breaking News

మున్నురుకాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కమిటీ ఏర్పాటు

– మున్నూరుకాపు జర్నలిస్టులు ఏకటాటిగా ఉండాలి – సామల వేణు

– మూన్నరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి సమస్యలు తీర్చాలి – సామల వేణు

– నాలుగు సంవత్సరాలుగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం కోసం చాలా కష్టపడ్డాం – రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్

హైదరాబాద్ : నేటి తెలంగాణ: మున్నూరు జర్నలిస్టులు సంఘటితంతో ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణ మున్నూరుకాపుల జర్నలిస్టు ఫోరం నూతన సంవత్సరం క్యాలెండర్, మూన్నూరుకాపు యూత్ ఫోర్స్ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా క్యాలెండర్, స్టిక్కర్లను ప్రముఖ మెజీషియన్ సామల వేణు, మూన్నూరుకాపు సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సీనియర్ జర్నలిస్టులు తులైల శ్రీనివాస్, డాక్టర్ పీఎల్ఎన్ పటేల్ తో కలిసి ఆవిష్కరించారు. సామల వేణు మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. వృత్తి ధర్మంలో ప్రజా సమస్యలను భుజాన వేసుకొని సొంత కుటుంబాలను సైతం మరిచిపోతారన్నారు. ప్రభుత్వం అండగా ఉంటే మరింత మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడుతారన్నారు. మూన్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 5వేల మంది సభ్యత్వం ఉండడం సంతోషకరమని, అదే తరుణంలో పేద, మధ్యతరగతి జర్నలిస్టులకు సైతం అండగా నిలబడాలన్నారు. కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ కేవలం నలుగురైదుగురు సభ్యులతో ప్రారంభమైన జర్నలిస్టు ఫోరం 5వేల సభ్యత్వాలకు విస్తరించిందన్నారు. నేడు 33 జిల్లాల్లో కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయని, ఫోరానికి అనుబంధంగా యూత్ ఫోర్స్ ప్రారంభించాయని, మున్నూరుకాపు యువత ఎంతో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారన్నారు. రానున్న రోజుల్లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ తరగతులు ఏర్పాట చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఎంకేజేఎఫ్ హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యపేట జిల్లాల అధ్యక్షులు పగడాల అరుణ్ కుమార్, తుడి జనార్ధన్, వేల్పుల శ్రీనివాస్, వీరాంజనేయులు, మున్నూరుకాపు (కాపు) విద్యార్ధి వసతి గృహం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్రీ ఆకుల వి. పాండురంగారావు, ట్రస్టీలు మందసూర్యప్రకాశ్, నిమ్మశంకర్, చంద్రశేఖర్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాలశ్రీనివాస్, సుంకరి రామూర్తి, ఆకుల రవీందర్, ఎడ్ల రంజిత్ పటేల్,విజయ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఉపాధ్యక్షులు ఆభూతి శ్రీనివాస్, ఇప్ప రాకేష్ పటేల్, కుల్ల రాజు పటేల్ , పంతం వెంకటేష్ పటేల్ , ఫోర్స్ నాయకులు తోట సాయిచరణ్, అభిషేక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *