Breaking News

ఆంజనేయ నగర్లో వర్షానికి కూలిన ప్రహరీ గోడ సంఘటన స్థలాన్ని కార్పొరేటర్ బాబురావు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయనగర్ రోడ్ నెంబర్ 5లో గల పార్క్ యొక్క ప్రహరీ గోడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన మాజీ కార్పొరేటర్ పగుడాల బాబూరావు . ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబురావు మాట్లాడుతూ కాంపౌండ్ వాల్‌ను సాధ్యమైనంత త్వరగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షానికి ప్రహరీ గోడ కూలడం జరిగిందని దానిని వెంటనే నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్ గౌడ్, పాండు గౌడ్, సబ్బు, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, ఎలక్ట్రికల్ లైన్ మాన్ సప్పిడి సురేష్, అశుతోష్ రెసిడెన్సీ వాసులు వెంకట్ కుమార్, హరికృష్ణ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *