నల్గొండ: బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గా లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఈద్గా గా వద్ద ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చిన ముస్లింలకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆలింగనం చేసుకొని ఈదుల్ హాజాహ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఈదుగాకు వచ్చిన అతిథులకు ఈద్గ హ కమిటీ ఉపాధ్యక్షులు శాంతి సంఘం సభ్యులు డాక్టర్ ఆఫీస్ ఖాన్ స్వాగతం పలికి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా ఎస్పీ చందనా దీప్తి, రెవిన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పి రాముల నాయక్, నల్లగొండ ఆర్డిఓ రవి ,మున్సిపల్ చైర్మన్ బులు శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సహోదరులు పాల్గొన్నారు