కూకట్ పల్లి : నేటి తెలంగాణ: అక్రమ నిర్మాణం కడుతున్నారంటూ బిల్డర్ ని బెదిరించిన కేసులో విలేకరిని కే.పీ.హెచ్.బీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేపీహెచ్బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కే.పీ.హెచ్.బి కాలనీ ఫేజ్-7లోని ఎంఐజీ 43లో పవన్ కుమార్ అనే వ్యక్తి భవనం నిర్మిస్తున్నాడు. అక్కడికి రిపోర్టర్లమంటూ జంగాల నాగార్జున, బత్తిన సుమన్ గౌడ్ వెళ్లి చెరో రూ.లక్ష ఇవ్వాలని, లేదంటే జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసి కూల్చివేయిస్తా మని బెదిరించారని పవన్ కుమార్ గత వారం కే.పీ.హెచ్.బి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం జంగాల నాగార్జునను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా, మరో నిందితుడు బత్తిని సుమన్డ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
