* ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్లు జూపల్లి సత్యనారయణ, సతీష్ గౌడ్
* మణిపూర్ అల్లర్లకు నిరసనగా పార్లమెంటులోనే నిరసన వ్యక్తం చేసింది బిఆర్ఎస్ పార్టీ – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
* కులాలను,మతాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తుంది బిజెపి పార్టీ – ఎమ్మెల్యే కృష్ణారావు
* రాబోయే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చుపెట్టి బిజెపి పార్టీని తెలంగాణలో తరిమికొట్టుతాం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి : నేటి తెలంగాణ : దేశంలో మోడీ ప్రభుత్వం కులాలను మతాలను రెచ్చగొట్టి అమాయకులైన ప్రజల ప్రాణాలను తీస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు
మణిపూర్ ఘటనకు నిరసనగా కూకట్పల్లిలో 3000 మంది క్రిస్టియన్లు ర్యాలీ తీస్తు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని క్రిస్టియన్ తో కలిసి ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ భారతదేశం చాలా ప్రశాంతంగా ఉండేదని అన్ని కులాలు అన్ని మతాలవారు ప్రశాంతంగా జీవించేవారని అలాంటి ప్రజలను బిజెపి ప్రభుత్వం ఏర్పడిన 9 సంవత్సరాల లో కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి విభేదాలు తీసుకువస్తున్నారని అందులో భాగంగానే మణుగూరు గతంలో చర్చిలను కూల్చివేయడం క్రిస్టియన్లను బట్టలు లేకుండా రోడ్డుపై నగ్నంగా నడిపించడం క్రిస్టియన్లను చంపేయడం చాలా బాధాకరమైన విషయం అని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎంపీలతో మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా పార్లమెంటులో సైతం నిరసన వ్యక్తం చేసి మోడీపై అవిశ్వాస తీర్మానం సైతం ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం అవుతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుండి కార్యకర్త వరకు ప్రధానమంత్రి మోడీపై తిరుగుబాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.