కూకట్ పల్లి : నేటి తెలంగాణ:
శనివారం కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 16 వేల మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా లబ్ధి చేకూర్చామని అన్నారు …దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.. నిరుపేదలు ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే ఒకప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేదని… కానీ నేడు ఆడపిల్లకు పెద్దన్నగా నేనున్నానన్న భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువంటి పథకాలు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు ..ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్.. మహేశ్వరి శ్రీహరి.. ముద్ధం నరసింహా యాదవ్ ..జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
.