– ఓల్డ్ బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో దళిత బంధు అవగాహన కార్యక్రమం, పాల్గొన్న కార్పొరేటర్లు అధికారులు
– దళితుల కుటుంబాలలో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
– బిజెపి కాంగ్రెస్ పార్టీలో సీఎం కేసీఆర్ దళితులకు ఇస్తున్న పథకం ఓర్వలేకపోతున్నారు – ఎమ్మెల్యే కృష్ణారావు
ఓల్డ్ బోయిన్ పల్లి: నేటి తెలంగాణ: 60 సంవత్సరాలలో భారతదేశంలో కాంగ్రెస్ బిజెపి పాలిస్తున్న ఏ రాష్ట్రాలలో కూడా దళితులను ఆదరించలేదని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్క దళితుడికి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళితుల కుటుంబాలలో వెలుగులు నింపిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారుకూకట్పల్లి నియోజకవర్గంలోని బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో నిర్వహించిన దళిత బంధు అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ఆకౌంటు జమ లేకుండా డైరెక్ట్ గా పదివేల లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు ఇచ్చి వ్యాపారాలు చేసుకొని వారి కుటుంబాలలో వెలుగు నింపుకోవాలనేది సీఎం కెసిఆర్ కోరిక అని అన్నారు అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలకి పది లక్షల రూపాయలు ఇచ్చారని, అంతేకాకుండా అన్ని వర్గాల వారికి ఏదో విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శమైన ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుంటే ప్రతిపక్ష నాయకులు బిజెపి నాయకులు బురదజల్లే పనులు చేస్తున్నారని బిజెపి పార్టీ వారు చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం చేస్తే దళితులు ఇంకా అభివృద్ధి అవుతారు తప్ప దళిత కుటుంబాలలో మన్ను కొట్టే పనులు చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నర్సింహ యాదవ్, సతీష్ గౌడ్,ఆవుల రవీందర్ రెడ్డి,సభీహ గౌసుద్దిన్, కోఆర్డినేటర్ సతీష్ అరోరా, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి హరిబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.