– ఓల్డ్ బోయిన్ పల్లి నుండి పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్
– ప్రజల వద్దకే పాలన ప్రజా సమస్యల తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేస్తాం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి : నేటి తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియపరుస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు .కూకట్ పల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేటి నుండి పాదయాత్ర సందర్బంగా ముందుగా తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో ఓల్డ్ బోయిన్పల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణ ధామ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యలు ప్రధానంగా పెండింగ్లో ఉన్న రోడ్లు విద్యుత్ స్తంభాలు మరియు లైట్లుకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి ఎందుకు ఆలస్యం అవుతుందో వివరణ ఇవ్వాలని ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కోఆర్డినేటర్ సతీష్ అరోరా,మహిళా అధ్యక్షురాలు అనితా శ్రీపాద జిహెచ్ఎంసి అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.