Breaking News

కూకట్ పల్లి బాలాజీ నగర్ లో బిజెపి పార్టీకి ఝలక్

– బిజెపి పార్టీకి మహిళా మోర్చ అద్యక్షురాలు రాజీనామా

 

– బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలు చూసే పార్టీలో చేరుకున్నాం – వీరగంటి జ్యోతి-

కూకట్ పల్లి నియోజక వర్గాన్ని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు చాలా అభివృధి చేశారు – మోర్చ అధ్యక్షురాలు – వీరగంటి జ్యోతి

కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కూకట్ పల్లి నియోజక వర్గంలోని బాలాజీనగర్ లో బిజెపి పార్టీకి చుక్కెదురు ఆయింది. బిజెపి పార్టీ మహిళ మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్యోతి జగదీష్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరింది. గులాబీ కండువా కప్పి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు పార్టీలోకి స్వాగతించారు. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు వీరగంటి జ్యోతి జగదీష్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు కూకట్ పల్లిలో ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అభివృధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కోఆర్డినేటర్ సతీష్ అరోరా, కే.పి.హెచ్.బి డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ ,నియోజక వర్గం యూత్ అధ్యక్షులు జన్ను సాయి,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *