కూకట్ పల్లి : నేటి తెలంగాణ: రాబోయే వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలప్రక్షాళన వేగవంతం చేయాలని జిహెచ్ఎంసి అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలను జారీ చేశారు.కూకట్పల్లి రంగదాముని చెరువు నుండి ప్రవహించే వర్షపు నీరు, డ్రైనేజీ నీరు స్వాన్ లేక్ మీదుగా కూకట్పల్లి నాలాలో కలిసే మార్గంలో నాలా సరిగా లేకపోవడం వలన భారీ వర్షాలు కురిసిన సమయంలో గత రెండు సంవత్సరాలుగా స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని వర్షం నీరు చేరి దాదాపు 200 కార్ల వరకు మునిగిపోయాయి. అదేవిధంగా ఈ నాల నుండి వచ్చే వర్షపు నీరు వలన కూకట్పల్లి డిపో వద్ద నీరు నిలిచిపోవడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలిగే విషయం గత రెండు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నామన్నారు. రంగదాముని చెరువు నుండి కూకట్పల్లి డిపో వరకు ఇరిగేషన్ అధికారులు, ఎమ్మార్వో , జిహెచ్ఎంసి అధికారులు సమన్వయం చేసుకొని మార్కింగ్ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి రాబోయే వర్షాకాలంలో నాలా పనులను పూర్తిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వామి, టౌన్ ప్లానింగ్ సిపి ఉమాదేవి, ఏసిపి మల్లీశ్వర్, ఇరిగేషన్ ఈఈ నారాయణ ,మాజీ కార్పొరేటర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.