షాబాద్,జూలై 27(ప్రజా కోట):గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేకడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన గంగమ్మ ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం రంగా రెడ్డి జిల్లా,షాబాద్ మండలం సర్దార్ నగర్ గ్రామానికి చెందిన పానుగంటి గండమ్మ భర్త యాదయ్య నివాసం ఉండే ఇల్లు భారీ వర్షాలకు కూలిపోయింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రజా ప్రతినిధులు,ఉన్నత అధికారులు స్పందించి నా జీవితం రోడ్డుపాలు కాకుండా ఏదో మార్గం చూపించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆమె అధికారులను కోరారు.అంతేకాకుండా నా భర్త యాదయ్య వింత వ్యాధి సోకి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు.అందుకు ప్రభుత్వ పెద్దలు ఏ విధంగానైనా నా కుటుంబాన్ని ఆదుకొవాలని కోరడం జరిగిందన్నారు.అంతేకాకుండా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య పెద్ద మనసుతో నా కుటుంబానికి అండగా ఉండి డబల్ బెడ్ రూమ్ మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలని ఆమె వేడుకోవడం జరుగుతుంది.దీంతోపాటు ఇంట్లో ఉన్న వంట సరుకులు సైతం భారీ వర్షానికి తడిసి ముద్ద అవడంతో తినడానికి తిండి సైతం కరువైందని ఆమె సూచించారు.దీనికి ఎమ్మెల్యే కాలే యాదయ్య,ప్రభుత్వ అధికారులు స్పందించి మమ్ములను ఆదుకోవాలని పలుమార్లు వేడుకోవడం జరిగిందన్నారు.