Breaking News

అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడంతోపాటు నాలలను మరమ్మతులు చేయించాం: శ్రీనివాస్ రెడ్డి

  • బృందావన్ కాలనీ,హౌసింగ్ బోర్డ్ కాలనీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడంతోపాటు వర్షాలకు నాలలను మరమ్మతులు చేయించాం: శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించడంతోపాటు వర్షాలకు నాలలు పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని బస్తీలో పర్యటించడం జరిగిందని కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.దాదాపు నాలుగు ఫీట్ల మేర నీరు పేరుకుపోవడంతో బస్తివాసులు భయాందోళనకు గురవుతూ,తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముందస్తు చర్యల్లో భాగంగా పక్కనే ఉన్న చెరువులోని నీటిని నాలాలోకి మళ్ళించడం జరిగింది.వరద నీరు విస్తృతంగా ప్రవహిస్తుండడంతో బస్తివాసులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కాలనీ సమస్యలపై జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నాలాల్లో పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి తొలగించడం జరిగింది.తద్వారా వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమం డివిజన్ అద్యక్షులు ఆడికే జనార్దన్,శ్రీనివాస్ రెడ్డి,నాగరాజ్,గణేష్, మన్మోహన్,మధుకర్, రాజేందర్,జీఎచ్ఎంసి ఎఈ బలవంత రెడ్డి,బాను, మాన్సూన్ స్పెషల్ టీం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *