Breaking News

కూకట్ పల్లి బిఆర్ఎస్ శ్రేణుల్లో మిన్నంటిన సంబురాలు

– కూకట్ పల్లి బిఅర్ఎస్ ఏమ్మేల్యే టికెట్ మాధవరం కృష్ణారావు కేటాయింపు

– సంబురాలు చేసుకున్న గులాబీ శ్రేణులు

కూకట్ పల్లి : నేటి తెలంగాణ:

తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో చేసిన సేవలను, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ కి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు .

కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేల తొలి జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో కూకట్పల్లి బిఆర్ఎస్ శ్రేణుల్లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముందుగా ఎమ్మెల్యే కృష్ణారావు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నానంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకొని కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిపించిన ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చమని కూకట్పల్లిలో ట్రాఫిక్ సమస్య మంచినీటి సమస్యలను మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కారం చేశామన్నారు. తాను ఎమ్మెల్యేకి గెలిచిన ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని రాబోయే ఎన్నికల్లో కూకట్పల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి కూకట్పల్లిలో గులాబీ జెండాను ఎగరేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *