బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను బాలానగర్ లో ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. కెసిఆర్ 70వ జన్మదినం సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి కోరుకున్నారు.

