కొందరు దళారులు అక్రమంగా గోవులను విక్రయించి సొమ్ము చేసుకుని వాటిని కమేలకు పంపించడం చాలా దుర్మార్గమైన చర్య:తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల బోర్డ్ సభ్యులు కోటి శ్రీధర్ జి
రాజేంద్ర నగర్,(ప్రజాకోట):కొందరు దళారులు అక్రమంగా గోవులను విక్రయించి సొమ్ము చేసుకుని వాటిని కమేలకు పంపించడం చాలా దుర్మార్గమైన చర్య అని తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల బోర్డ్ సభ్యులు కోటి శ్రీధర్ జి ఆరోపించారు.గురువారం తెల్లవారుజామున 24 గోమాతలను అక్రమంగా తరలిస్తున్న సమాచారం మేరకు గోరక్షా దళ్,గోరక్షాదళ్ టైగర్ ఫోర్స్,గోగ్యాన్ ఫౌండేషన్ అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ రాముజీ ఫిల్మ్ సిటీ రహదారిలో ఎపి 39టిక్యు 5019,ఎపి39యు ఎచ్ 8282 అనే 2 బొలెరో వాహనాలను తనిఖీ చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది.అనంతరం సురక్షితంగా శ్రీ సమర్థ కామధేను గోశాల జియాగూడకు తరలించారు.ఈ కార్యక్రమంలో గోరక్షా దళ్ తెలంగాణ అధ్యక్షుడు కాలు సింగ్,గోరక్షాదళ్ టైగర్ ఫోర్స్ దీపక్ సింగ్,టీటీడీ గోశాల బోర్డు సంరక్షణ సభ్యులు కోటి శ్రీధర్ జీ,గోజ్ఞాన్ ఫౌండేషన్ నితేష్ విజయవర్గియా,బీజేవైఎం యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పవన్‌రెడ్డి,యుగ్ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్,బీజేపీ తుక్కుగూడ కౌన్సిలర్ యాదరిగిరి,బీజేవైఎం అధికార ప్రతినిధి రవీందర్‌గౌడ్,డాక్టర్ ఎర్రం పూర్ణం శాంతి గుప్త,శ్రవణ్,జెఆర్‌పవన్,సోను సింగ్,బిడ్లా,శంకర్ యాదవ్,నరేష్,అఖిల్,సురేష్,జానీ,వంశీ,సాయి,వంశీ,కన్న మణి,చత్నియా,కన్న తదితరులు పాల్గొన్నారు.
