Breaking News

ప్రభుత్వం ఆదుకోకుంటే మా బతుకు రోడ్డు పాలే:అన్నదమ్ముల దీనగాద

రాజేంద్ర నగర్,జూలై27 :గత వారం రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మా పురాతన పెంకుటిల్లు కూలిపోవడంతో మాకు ఎలాంటి దిక్కు లేకుండా పోయిందని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా గ్రామ దళిత సోదరులు చామ్లెట్ వేణు చామ్లెట్,నవీన్ మాకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.అత్తాపూర్ హైదర్ గూడ 3-2-72 ఎస్సి బస్తీలో చామ్లెట్ వేణు చామ్లెట్,నవీన్ అన్నదమ్ముళ్లు నివసించే గృహం పన్నెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధ్వంసం అవ్వడం జరిగింది.తమ తండ్రి చామ్లెట్ అశోక్ 1985 లో నిర్మించిన ఇల్లు మట్టి గోడలతో నిర్మించడం వల్లన ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి నిలవలేక కూలిపోవడం జరిగిందని,అన్నతమ్ముళ్ళు ఇప్పుడు గూడు లేని పక్షులమయ్యామని విలపిస్తున్నారు.ఆరు సంవత్సరాల క్రితం తమ తండ్రి అకాల మరణం చెందగా వారి తల్లి ప్రమీల గారిని ఇక్కడ ఇల్లు పరిస్థితి బాగోలేనందున తమ సోదరి స్రవంతి బావ అరుణ్ ఇంట్లో ఉంచారు.గురువారం అర్థ రాత్రి అన్నదమ్ములు నిద్రిస్తున్న సమయంలో కూలిపోవడం జరిగిందని,తాము నిద్రిస్తున్న గది కాకుండా వంటగది స్టోర్ రూమ్ కి వాడుకునే గదులు కూలిపోవడంతో అన్నాతమ్ముళ్ళిద్దరు కన్నీటిపర్వమయ్యారు.ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కొత్త ఇంటి కోసం అధికారులు వారికి నష్టపరిహారం అందేలా సహకరించాలని కోరుకున్నారు.