కూకట్ పల్లి : నేటి తెలంగాణ: కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, లలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీటితో ముంపుకి గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహ గౌసుద్దిన్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, స్థానిక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బస్తీ అధ్యక్షులతో కలిసి పరిశీలించారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు, ముంపుకు గురైన ప్రజలను పునరావాస కేంద్రం సఫ్దర్ నగర్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగిందని ముంపునకు గురైన ప్రజలకు అక్కడికి తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షేక్ రఫీక్, సయ్యద్ రియాజ్, రాంబాబు, మల్లేష్, అబ్దుల్ సలీం, అస్లం, షాహిద్, అహ్మద్, నరసింహారెడ్డి, అశు, శ్రీనివాస్, రమేష్, సయ్యద్ మోయిన్, తదితరులు పాల్గొన్నారు.