బాలానగర్: నేటి తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం మొత్తం విస్తారంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం బాలానగర్ డివిజన్ పరిధిలోని కల్యాణి నగర్ మరియు వినాయక్ నగర్ లో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరితే వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరితే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని, శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ప్రజలు ఉండొద్దని కోరారు.
కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం మరియు శానిటేషన్ సిబ్బందితో పాటు కళ్యాణి నగర్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి,వెంకటేశ్వర్లు, నాయకులు ప్రేమ్ కుమార్,రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్,ఎం. సుధాకర్,మొహమ్మద్ సోఫీ మరియు స్థానికులు పాల్గొన్నారు