Breaking News

కూకట్‌పల్లి హైదర్ నగర్ జెమ్ మోటార్స్ లో స్వల్ప అగ్నిప్రమాదం

కూకట్ పల్లి: నేటి తెలంగాణ: కూకట్‌పల్లి హైదర్ నగర్ లోని జెమ్ మోటార్స్ సర్వీసింగ్ సెంటర్లో ఈ రోజు అగ్నిప్రమాదం సంభవించింది. పెయింటింగ్ సెక్షన్ లో పెయింటింగ్ కొరకు ఉపయోగించే కంప్రెసర్ పేలి మంటలు చెలరేగడంతో పొగలు సర్వీసింగ్ సెంటర్లో వ్యాపించాయి. అపమత్తమైన సిబ్బంది మంటలను అదుపులో తీసుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని జెమ్ మోటార్స్ సిబ్బంది తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *