* ప్రజా వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొనుటకు పాదయాత్ర
* 90 శాతం పనులు పూర్తి చేశాం పెండింగ్లో ఉన్న పనులు సత్వరగా పూర్తి చేయాలి
కూకట్ పల్లి : నేటి తెలంగాణ : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లు , డివిజన్ అధ్యక్షులతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కాబోయే పాదయాత్రకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని.. ఇప్పటికే దాదాపు నియోజకవర్గంలో 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు చేపట్టామని భూగర్భ పైప్లైన్ల ద్వారా వరద నీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టామని ఇందుకు నిదర్శనమే ఇటీవల కురిసిన భారీ వర్షాలు కూడా తట్టుకోగలిగామని అన్నారు.. ఒకప్పుడు చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు వరకు నీరు నిండేదని కానీ నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు.ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పే బాధ్యత మనపై ఉందని అలాగే సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని వివరించారు.. ఈ పాదయాత్రలో ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వారి వద్దకే వెళుతున్నాం అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు